బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 జులై 2018 (11:50 IST)

ఇద్దరు పిల్లలు.. కు.ని. చేయించుకున్నా.. గర్భందాల్చిన మహిళ ఎలా?

ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇక చాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.. ఆ మహిళ. అయితే మళ్లీ గర్భం దాల్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చమ్రోలీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, సుధ (28), బసంత

ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇక చాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.. ఆ మహిళ. అయితే మళ్లీ గర్భం దాల్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చమ్రోలీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, సుధ (28), బసంత్ కుమార్‌ దంపతులకు ఇద్దరు సంతానం వున్నారు. ఇద్దరు పిల్లలకు తర్వాత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. 
 
కానీ ఈ ఆపరేషన్ జరిగిన ఆరు నెలల తర్వాత మళ్లీ ఆమె గర్భం దాల్చింది. దీంతో భార్యాభర్తలిద్దరూ షాకయ్యారు. వైద్యులను సంప్రదించగా... కు.ని. ఆపరేషన్లలో రెండు శాతం వరకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఇటీవలే సుధ మూడో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మాట్లాడుతూ, కు.ని. ఆపరేషన్ ఫెయిల్ అయితే.. ప్రభుత్వం రూ. 30 వేలు నష్టపరిహారంగా ఇస్తుందని తెలిపారు.