శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జులై 2018 (11:04 IST)

కు.ని ఆపరేషన్ చేయించుకుంది.. అయినా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. ఎలా?

సాధారణంగా పిల్లలు పుట్టకుండా ఉండేందుకు మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటారు. అదే పురుషులు అయితే వ్యాసెక్టరీ చేయించుకుంటారు. అయితే, కొన్నిసందర్భాల్లో ఇవి విఫలం కావడంతో పిల్లలు పుడుతున్నారు. తా

సాధారణంగా పిల్లలు పుట్టకుండా ఉండేందుకు మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటారు. అదే పురుషులు అయితే వ్యాసెక్టరీ చేయించుకుంటారు. అయితే, కొన్నిసందర్భాల్లో ఇవి విఫలం కావడంతో పిల్లలు పుడుతున్నారు. తాజాగా, కు.ని ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చమ్రోలీ గ్రామానికి చెందిన సుధ (28), బసంత్ కుమార్ ‌అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అనంతరం సుధ బరోలీ అహిర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరి భవిష్యత్‌లో పిల్లలు పుట్టకుండా కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. 
 
కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు సుధ మళ్లీ గర్భం దాల్చింది. దీనిపై వైద్యులను ప్రదించగా కుటుంబనియంత్రణ ఆపరేషన్లలో రెండు శాతం ఫెయిల్యూర్ అవుతున్నాయనీ, ఈ కారణంగానే సుధ గర్భందాల్చినట్టు వెల్లడించారు. అయితే, కు.ని ఆపరేషన్ ఫెయిల్ అయితే ప్రభుత్వం రూ.30 వేలు నష్టపరిహారంగా ఇస్తుందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ముఖేష్ కుమార్ చెప్పారు.