శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 మార్చి 2017 (09:40 IST)

ఖాళీ అవుతున్న శశికళ శిబిరాలు... ఓపీఎస్‌ జైకొడుతున్న అన్నాడీఎంకే నేతలు

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరాలు ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. మన్నార్గుడి మాఫియాగా ముద్రపడిన శశికళ కుటుంబీకుల చేతుల్లో అన్నాడీఎంకే పార్టీ ఉండటాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేత

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరాలు ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. మన్నార్గుడి మాఫియాగా ముద్రపడిన శశికళ కుటుంబీకుల చేతుల్లో అన్నాడీఎంకే పార్టీ ఉండటాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా మాజీ ముఖ్యమంత్రి ఓపీఎస్ వర్గానికి జైకొడుతున్నారు. 
 
తాజాగా తిరుప్పూర్‌ జిల్లా నిర్వాహకులు ఓపీఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు. జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, నిర్వాహకులు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌ సెల్వంకు మద్దతుగా నిలిచారు. ఎంపీ సత్యభామ, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఉపకార్యదర్శి, జాయింట్‌ కార్యదర్శి, మైనారిటీ, రైతులు, జాలర్ల విభాగాలు, ఎంజీఆర్‌ మండ్రం, ఎంజీఆర్‌ యువకుల విభాగం, మాజీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మాజీ మున్సిపాలిటీ అధ్యక్షులంటూ అనేకమంది ఓపీఎస్‌కు మద్దతు తెలియజేశారు. దీంతో తిరుప్పూర్‌ జిల్లాకు సంబంధించిన వరకు శశికళ గుడారం ఖాళీ అయింది.