ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

బీజేపీ నేత దాష్టీకం.. గిరిజన యువతిని జుట్టుపట్టి లాక్కెళ్లి రేప్ చేశాడు... 36 గంటలపాటు...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారమదంతో కొట్టుమిట్టాడుతున్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత సభ్యసమాజం తలదించుకునేలా బరితెగించాడు. గిరిజన యువతి ఇంటికెళ్లి ఆమెను జుట్టుపట్టుకుని లాక్కెళ్లి అత్యాచారానికి తె

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారమదంతో కొట్టుమిట్టాడుతున్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత సభ్యసమాజం తలదించుకునేలా బరితెగించాడు. గిరిజన యువతి ఇంటికెళ్లి ఆమెను జుట్టుపట్టుకుని లాక్కెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు. పైగా.. తన ఐదుగురు స్నేహితులతో కూడా గ్యాంగ్ రేప్ చేయించాడు. తనపై పెట్టిన వేధింపుల కేసు విత్‌డ్రా చేసుకోకపోవడంతో ఆ యువతిపై బీజేపీ నేత ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మధ్యప్రదేశ్‌లోని బైతూల్ జిల్లా అమ్లా పరిధిలో నివసిస్తున్న గిరిజన యువతి గురువారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తోంది. ఈ ఇంటికి స్థానిక బీజేపీ నేత ఒకరు వెళ్లి ఆమెను జుట్టుపట్టుకుని బయటకు లాక్కొచ్చాడు. సమీపంలోని నిర్మానుష్యంగా ఉన్న అడవిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
స్పృహలోకొచ్చిన యువతి జరిగిన ఘటన గురించి వివరించింది. తనను దగ్గర్లోని అడవికి తీసుకెళ్లి, 36 గంటల పాటు సామూహికంగా మృగాల్లాగా మీద పడి అత్యాచారానికి పాల్పడ్డారని బోరున విలపిస్తూ చెప్పింది. తనకు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని, స్పృహ కోల్పోయానని తెలిపింది. తిరిగి స్పృహలోకొచ్చిన తాను 13 కిలోమీటర్లు నడిచి బైతూల్‌కు చేరుకున్నానని, ఇంటికి ఫోన్ చేసి జరిగింది చెప్పినట్లు ఆ యువతి పేర్కొంది. ఆ తర్వాత మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేసినట్లు ఆ యువతి తెలిపింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్ స్పందించారు. విచారణకు ఆదేశించారు.