శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (14:55 IST)

చేపల కూర వండటం రాదని గొడవపడ్డ భర్త- భార్య ఏం చేసిందంటే?

భర్తతో చేపల కూర వండటం రాదని చెప్పింది ఓ భార్య. అంతే కోపంతో భర్త గొడవపడ్డాడు. అంతే మనస్తాపానికి గురైన భార్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అడ్డుకోబోయిన భర్త కూడా అగ్నికి బలైపో

భర్తతో చేపల కూర వండటం రాదని చెప్పింది ఓ భార్య. అంతే కోపంతో భర్త గొడవపడ్డాడు. అంతే మనస్తాపానికి గురైన భార్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అడ్డుకోబోయిన భర్త కూడా అగ్నికి బలైపోయాడు. ఈ ఘటన తిరుచ్చిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చికి చెందిన సురేష్ (40), సత్య (35) దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె వుంది.
 
చేపలు పట్టుకొచ్చి కూర వండాల్సిందిగా చెప్పిన సురేష్ ఎక్కడికో బయటికి వెళ్లాడు. గంట తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. ఆపై భార్యకు చేపలు కూర వండటం రాదని తెలుసుకుని కోపంతో ఊగిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన సత్య ఇంట్లోని కిరోసిన్‌ను శరీరంపై కుమ్మరించుకుని నిప్పంటించుకుంది. భార్యను కాపాడాలనుకున్న సురేష్ కూడా గాయపడ్డారు. వీరిద్దరినీ స్థానికులు తిరుచ్చి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. 
 
అయితే చికిత్స ఫలించక సురేష్, సత్య ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.