శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2022 (14:13 IST)

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా

road accident
మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. బేతుల్ జిల్లా ఝల్లార్  దగ్గర్లో ఓ ప్రైవేటు బస్సు,  టవేరా వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణించిన వారిలో 11 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతులు మహారాష్ట్రలోని అమరావతి జిల్లా కల్మట్టలో పనిచేస్తున్న కార్మికులేనని తెలుస్తోంది.   
 
ఇక ఈ మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదంపైప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా.. అలాగే గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.