గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జులై 2022 (18:18 IST)

రామసేతుపై మళ్లీ మొదలైన పరిశోధనలు.. సముద్రం నీటి అడుగున టూర్

రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు వంతెన గురించి అందరికీ తెలిసిందే. అదే రామసేతు. ఇది రామాయణ కాలంనాటిదని హిందువుల ప్రగాఢ విశ్వాసం. నారాయణుడే నరుడిగా వచ్చి వారధి కట్టాడని నమ్ముతారు. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికీ రామసేతుపై ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి.  
 
తాజాగా రామసేతుపై మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిందా? లేక మానవ నిర్మితమా? అనే విషయాన్ని తేల్చే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. 
 
సీతాదేవిని అపహరించిన రావణసూరుడిని అంతమొందించేందుకు లంకకు బయల్దేరేందుకు గాను శ్రీరాముడు వానర సేనతో ఈ వారధిని నిర్మించినట్లు చెప్తారు. వానరసేన సాయంతో రాళ్లను సముద్రంలో పేర్చి వారధి నిర్మిస్తారు.. ఆ వారధి పైనుంచే సముద్రాన్ని దాటి.. లంకకు చేరుకుని రావణాసురుడిని వధిస్తాడు శ్రీరాముడు.
 
ఇది పురాణ గాధే. ఆ వారధి ఇంకా ఉంది. అయితే సముద్రం నీటిలో ఉంది. 2003లో నాసా పరిశోధనలో కొన్ని నిజాలు బయటికి వచ్చాయి. భారత్‌-శ్రీలంక మధ్య సముద్రంలో ఇంకా సేతువు ఉందని శాటిలైట్ చిత్రాలతో గుర్తించింది నాసా. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి రామసేతు వారధి తెరపైకి వచ్చింది.
 
రాబోయే రెండేళ్లలో రామసేతు వారధిని అసలు నిజం తేల్చేందుకు రంగంలోకి దిగింది నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ. వారధి ప్రాంతంలో డ్రిల్లింగ్ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది. సముద్రం నీటి అడుగున పర్యటించనుంది.