సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 2 జులై 2022 (17:34 IST)

అత‌ని వ‌ల్లే అబార్ష‌న్ చేయించుకున్నా- కుబ్రా సెయిట్‌

Kubra Sait,  Open Book
Kubra Sait, Open Book
న‌టి కుబ్రా సెయిట్ త‌న లైఫ్‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌కు సంబంధించి సీక్రెట్ చెప్పేసింది. వెబ్‌సిరీస్ పుణ్య‌మా అని వెలుగులోకి వ‌చ్చిన ఈ న‌టి `సీక్రెట్ గేమ్స్‌` అనే వెబ్‌సిరీస్‌లో న‌టించి ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ వెబ్‌సిరీస్‌కు ముందే త‌న కుటుంబ‌స‌భ్యుడు ఒక‌రు త‌న‌ను లైంగికంగా అనుభ‌వించాడు. అత‌నివ‌ల్లే గ‌ర్భం దాల్చాను. కానీ తెలిసి ఆ త‌ర్వాత తీసివేసికున్నానంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఇలా చేయ‌డం త‌న‌కేమీ త‌ప్పుకాఅనుకోవ‌డంలేద‌ని అంటోంది. ఆడ‌వాళ్ళ‌కు 23 ఏళ్ళ‌కే పెండ్లి, 30 ఏల్ళ‌కు పిల్ల‌ల్ని క‌నాల‌నే రూల్ ఏమిటో త‌న‌కు అర్థంకావ‌డంలేద‌ని అంటోంది.
 
Kubra Sait -- Andaman
Kubra Sait -- Andaman
ఈ అమ్మ‌డు జూన్ 27న  `ఓపెన్ బుక్‌` నాట్ ఎ క్వ‌యిట్ మెమొరీస్‌` అనే పుస్త‌కాన్ని రాసి విడుద‌ల చేసింది. ఇందులో త‌న వ‌ర్జీనిటీని పోగొట్టిన వ్య‌క్తి గురించి రాసింది. 2013లో అండ‌మాన్ వెళ్ళాను. అక్క‌డ స్కూబా డైవింగ్‌సెష‌న్ త‌ర్వాత డ్రింక్ తీసుకున్నాను. ఆ త‌ర్వాత ఆ స్నేహితుడితో ప‌డుకున్నాను. కొన్నాళ్ళ‌కు గ‌ర్భం అని తేలింది. అంటూ తాజాగా బుక్ లాంచ్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. తాను రాసిన బుక్‌లో 24 చాప్ట‌ర్లు వున్నాయి. అందులో ఇది ఒక‌ట‌ని తెలిపింది. అలాగే వెబ్ సిరీస్‌కూ సినిమాకు ఏమీ తేడాలేద‌ని చెబుతోంది.