శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (13:02 IST)

జైట్లీ నోట గాంధీ మాట.. నిర్ణయం సరైనదైతే.. అది ఎన్నటికీ విఫలం కాదు.. బడ్జెట్ హైలైట్స్

కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీని జైట్లీ స్మరించుకున్నారు. నిర్ణయం సరైనదైతే... అది ఎన్నటికీ విఫలం కాదంటూ గాంధీ ఉద్బోధను జైట్లీ గ

కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీని జైట్లీ స్మరించుకున్నారు. నిర్ణయం సరైనదైతే... అది ఎన్నటికీ విఫలం కాదంటూ గాంధీ ఉద్బోధను జైట్లీ గుర్తుచేశారు. గాంధీ కలలుగన్నట్టు అవినీతి లేని, పారదర్శక పాలన కోసం తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఎస్పీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతి కోసం చర్యలు తీసుకుంటామన్నారు. నల్లధనం నిర్మూలనకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రజల ధనానికి తాము రక్షకులుగా ఉంటామని వెల్లడించారు. 
 
ఇక పెద్దనోట్ల రద్దుతో ఆదాయపన్ను చెల్లించే వారి దొంగచాటు తనం ఏంటో అర్థమైందని జైట్లీ అన్నారు. ఆదాయ‌ప‌న్ను చెల్లించే వారి సంఖ్య త‌క్కువ‌గా ఉంది. పెద్ద నోట్ల ర‌ద్దు తర్వాత వాస్త‌వ దృశ్యం బ‌య‌ట‌కు వ‌చ్చిందన్నారు. జీడీపీలో ప‌న్నుల‌శాతం త‌క్కువ‌గా ఉంది. ప్ర‌త్య‌క్ష ప‌న్నుల ద్వారా 1.74ల‌క్ష‌ల కోట్లే వ‌స్తోందని వెల్లడించారు. 
 
ఇకపోతే.. ర‌క్ష‌ణ రంగ కేటాయింపులు రూ.2.74ల‌క్ష‌ల కోట్లని, మొత్తం బ‌డ్జెట్ రూ.21ల‌క్ష‌ల 47వేల కోట్లని జైట్లీ తెలిపారు. ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల స్వాధీనం. దీనికోసం కొత్త‌చ‌ట్టం రూపొందిస్తామని జైట్లీ చెప్పుకొచ్చారు. 
 
2017-బడ్జెట్ హైలైట్స్
* 20ల‌క్ష‌ల ఆధార్ ఆధారిత స్వైపింగ్ యంత్రాలు
* పోస్టాఫీసు ద్వారా పాస్‌పోర్ట్ అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌.
* డిజిట‌ల్ లావాదేవీల రూప‌క‌ల్ప‌న ఆధార‌త్‌తో కూడా చెల్లింపుల‌కు అవ‌కాశం
* వ్య‌క్తిగ‌త వినియోగ‌దారుల‌కు, వ్యాపార‌స్థుల‌కు కొత్త‌గా మ‌రో రెండు ప‌థ‌కాలు.
* 250 ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల ఉత్పాద‌క కేంద్రాలు. ఎల‌క్ట్రానిక్ ఉత్పాద‌క కేంద్రాల కోసం రూ.1.26 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు 
* ముద్రా రుణాల కోసం రూ.2ల‌క్ష‌ల 44 వేల కోట్లు
* 20,000 మెగావాట్ల సౌర‌విద్యుత్ ఉత్ప‌త్తి ల‌క్ష్యం.
* ఒడిశా, రాజ‌స్థాన్‌ల్లో చమురు నిల్వ‌ల కేంద్రాలు.
* విదేశీ పెట్టుబ‌డుల కోసం ఎఫ్ఐపీబీ ర‌ద్దు.
* మెట్రోరైలు ఏర్పాటులో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యం.
* రైల్వేల‌కు రూ.55వేల కోట్ల ప్ర‌భుత్వ సాయం.
* రైల్వే బ‌డ్జెట్‌కు రూ.1.31ల‌క్ష‌ల‌ కోట్లు కేటాయింపు.
* గ‌ర్భిణి ఆస్ప‌త్రి ఖ‌ర్చుల‌కు రూ.6వేల బ‌ద‌లాయింపు.
* మౌలిక రంగానికి రూ.3,96,135 కోట్లు
* ర‌హ‌దారులకు రూ.64వేల కోట్లు. మెట్రో రైల్వే విధానం రూప‌క‌ల్ప‌న‌.
* దేశ‌మంత‌టా భార‌తమెట్రో సేవలు.
* హైస్పీడ్ బ్రాండ్ బ్యాండ్ అనుసంధానికి ప్రాధాన్యం.
* దేశ‌మంతా హాట్‌స్పాట్‌లు 25 రైల్వేస్టేష‌న్ల ఆధునికీక‌ర‌ణ‌.
* 2020నాటికి కాపాల‌దారులేకుండా చ‌ర్య‌లు. రైల్వే క్రాసింగుల మూసివేత‌.
* 2017-18లో కొత్త‌గా 3,500కి.మీ. మేర రైళ్ల స‌ర్వీస్ పొడిగింపు.
* ఐఆర్‌సీటీసీ టికెట్ల‌పై స‌ర్వీస్ ఛార్జీలు ఎత్తివేత‌
* రైల్వేల ర‌వాణా ప్రైవేటురంగం నుంచి పోటీ.
* ఐదు ప్రత్యేక పర్యాటక జోన్ల అభివృద్ధి.
* విద్యా రంగం కోసం ప్రత్యేకంగా డీటీహెచ్ చానల్.
* 600 జిల్లాల్లో ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు.
* నైపుణ్యాభివృద్ధికి రూ. 4 వేల కోట్లతో సంకల్ప నిధి.
* ఫ్లోరైడ్ పీడిత 28 వేల గ్రామాలకు ప్రత్యేక తాగునీటి పథకాలు.
* మహిళా సాధికారత కోసం రూ. 500 కోట్లతో మహిళా శక్తి కేంద్రాలు.
* గర్భిణీలకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ. 6 వేల నగదు బదిలీ.
* గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా.
* గృహ రుణాలిచ్చే బ్యాంకులకు జాతీయ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ. 20 వేల కోట్ల రుణం.
* నోట్ల రద్దు ద్వారా వచ్చిన నగదుతో నిండిన బ్యాంకులు.
* పరిమిత స్థాయిలో గృహ రుణాలపై వడ్డీ రేటును ఇప్పటికే తగ్గించిన ప్రధాని.
* భవిష్యత్తులో మరింతగా తగ్గనున్న గృహ రుణ వడ్డీ.
* జనరిక్ ఔషధాల వినియోగానికి ప్రత్యేక విధానం.
* వైద్య పరికరాల ఉత్పత్తికి మరిన్ని నిధులు.
* 2025లోగా క్షయ వ్యాధి నిర్మూలనకు చర్యలు.
* షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి రూ. 52,393 కోట్లు.
* గిరిజనులకు రూ. 31,920 కోట్లు.
* మైనారిటీలకు రూ. 4,195 కోట్లు.
* అంత్యోదయ యోజనకు రూ. 2,500 కోట్లు కేటాయింపు.
* జాతీయ రహదారులకు రూ. 64 వేల కోట్లు.
* ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు రూ. 19,100 కోట్లు.
* వృద్ధులకు 8 శాతం వడ్డీపై ఎల్ఐసీ ప్రత్యేక బాండ్లు.
* గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కోసం భారత్ నెట్ ద్వారా రూ. 10 వేల కోట్లు.
* ఈ సంవత్సరం 1.5 లక్షల గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ.
* రూ. 3.96 లక్షల కోట్లతో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్.
* 20 వేల మెగావాట్ల సౌరశక్తి ఉత్పాదన ఈ సంవత్సరం లక్ష్యం.
* విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు రద్దు.
* ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు.
* బ్యాంకులకు రూ. 10 వేల కోట్ల మూలధన సాయం.
* ప్రధాని ముద్ర యోజన రుణాల లక్ష్యం రూ. 2.44 లక్షల కోట్లు.
* జార్ఖండ్, గుజరాత్ లో కొత్తగా ఎయిమ్స్ ఏర్పాటు.
* త్వరలో మరో రెండు రకాల భిమ్ యాప్స్.
* భిమ్ ఉపయోగిస్తే క్యాష్ బ్యాక్ సౌకర్యం.
* ఇప్పటికే కోటీ 25 లక్షల మంది వద్ద భీమ్ యాప్.
* పీజీ మెడికల్ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంపు.
* వైద్య పరికరాల ధరలు తగ్గించేందుకు చర్యలు.
* ఆరోగ్య కేంద్రల సంఖ్య పెంపు, నిపుణులైన వైద్యుల నియామకం.
* ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకు పెద్దపీట.
* వృద్ధులకు ఆధార్ కార్డే ఆరోగ్య కార్డు.
* నగదు రహిత లావాదేవీల లక్ష్యం రూ. 2,500 కోట్లు.
* ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి వెళితే కఠిన చర్యలు.
* బ్యాంక్ డీఫాల్టర్ల ఆస్తుల జప్తు కోసం కొత్త చట్టం.
* సామాన్యులకు ప్రయోజనాలను దగ్గర చేసేలా నగదు రహిత చెల్లింపు వ్యవస్థ.
* పెట్రోలు బంకులు, ఆసుపత్రుల్లో నగదు రహిత చెల్లింపులకు మరింత ప్రోత్సాహం.