శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మే 2024 (13:18 IST)

ఇద్దరు యువకులతో అసభ్యకరరీతిలో భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన భార్య... ఎక్కడ?

romance
మనస్పర్థల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న ఓ భార్య... ఇద్దరు యువకులతో హోటల్ గదిలోని బాత్రూమ్‌లో అభ్యంతరకరరీతిలో రెడ్ హ్యాండెడ్‌గా భర్తకు పట్టుబడింది. దీంతో ఆమెను భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పట్టుకుని చితకబాదారు. ఈ పాడుపనికి పాల్పడింది ఓ వైద్యురాలు కావడం గమనార్హం. తాజాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాస్‌గంజ్ ఏరియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు గత యేడాది కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, భార్య ప్రవర్తన, కదలికలపై భర్యకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో మహిళా వైద్యురాలైన భార్య.. ఓ హోటల్ గదిలోని బాత్రూమ్‌లో ఇద్దరు యువకులతో కలిసి అసభ్యకరరీతిలో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఆ యువకులపై డాక్టర్, ఆయన కుటుంబ సభ్యులు దాడి చేశఆరు. వారు కూడా దాడికి కలబడటంతో హోటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 
 
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న మహిళా వైద్యురాలితో పాటు ఘజియాబాద్‌, బులంద్‌షహర్‌కు చెందిన ఇద్దరు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత వైద్యుడి ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, ఆమె మాత్రం తన భర్తపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.