ఉత్తరప్రదేశ్ ఘోర రైలు ప్రమాదం... 23 మంది మృతి...

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి వద్ద పూరీ- హరిద్వార్‌- కళింగ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన 14 బోగీలు పట్టాల తప్పడంతో 23 మంది మృతిచెందారు. మరో 40 మందికి పైగా గాయాలయ్యాయి. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుం

rail-accident
ivr| Last Modified శనివారం, 19 ఆగస్టు 2017 (22:26 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి వద్ద పూరీ- హరిద్వార్‌- కళింగ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన 14 బోగీలు పట్టాల తప్పడంతో 23 మంది మృతిచెందారు. మరో 40 మందికి పైగా గాయాలయ్యాయి. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. 
 
పట్టాలు తప్పడంతో రైలు బోగీలు పట్టాలు పక్కనే ఉన్న ఇళ్లల్లోకి దూసుకెళ్లాయి. ఈ కారణంతో ఇళ్లలోని ప్రజలకు కూడా గాయాలయినట్లు తెలుస్తోంది. ప్రమాద సంఘటనపై రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు విచారణకు ఆదేశించారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు ఛైర్మన్‌కు ఆదేశాలిచ్చారు.దీనిపై మరింత చదవండి :