గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (23:13 IST)

సొంత చెల్లెలి మెడలో తాళి కట్టిన అన్నయ్య.. ఎందుకో తెలిస్తే?

యూపీలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బు కోసం ఓ వ్యక్తి సొంత చెల్లెలినే పెళ్లి చేసుకున్నాడు. ఆపై పారిపోయాడు. డిసెంబర్ 11 న నిర్వహించిన సామూహిక వివాహంలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సామూహిక వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం డబ్బు, ఇతర సౌకర్యాలను అందజేస్తోంది. 
 
ఇక వీటి కోసం ఆశపడిన ఒక వ్యక్తి సొంత చెల్లిని పెళ్లికూతురిగా మార్చి వివాహానికి హాజరయ్యాడు. అందరిలానే చెల్లి మెడలో తాళికట్టి భార్యను చేసుకున్నాడు. తర్వాత.. ప్రభుత్వం ఇచ్చే డబ్బు, ఇతర సౌకర్యాలను అందుకుని పారిపోయాడు. 
 
అయితే ఇటీవల వారి ఆధార్ కార్డులను పరిశీలించిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ అధికారి చంద్రభాన్ సింగ్ వారిద్దరూ అన్నాచెల్లెలుగా గుర్తించడంతో విషయం బయటపడింది. 
 
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, వారి ఆచూకీ కనుగొని ప్రభుత్వ పథకం కింద అందించిన గృహోపకరణాలు వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు.