శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2017 (13:24 IST)

బాలికల కాళ్లు కడిగి.. పసుపు పూసి... పాదపూజ చేసిన సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొమ్మిది మంది బాలికలకు కాళ్లుకడిగి పాదపూజ చేశారు. లక్నోలో నిర్వహించిన నవమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని సాంప్రదాయ పద్దతిలో పూజలు చేశారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొమ్మిది మంది బాలికలకు కాళ్లుకడిగి పాదపూజ చేశారు. లక్నోలో నిర్వహించిన నవమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని సాంప్రదాయ పద్దతిలో పూజలు చేశారు. పార్వతీదేవి తొమ్మిది అవతారాలకు చిహ్నంగా తొమ్మిదిమంది బాలికలకు సీఎం యోగి కన్య పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
 
అనంతరం తొమ్మిది మంది బాలికల పాదాలు కడిగి వారికి తిలకం దిద్దారు. పూజా కార్యక్రమాల తర్వాత హల్వా, పూరీ వంటి సాంప్రదాయ పిండి వంటలను బాలికలకు వడ్డించి వారితో 'అన్నదాతా సుఖీభవ' అని దీవించుకున్నారు. కాగా, ప్రతి ఏటా కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి తొమ్మిది రోజుల పాటు పూజలు జరుగుతుంటాయని తెలిపారు. 
 
ఈ తొమ్మిది రోజులు సీఎం యోగి ఖచ్చితమైన నియమనిబంధనలతో కూడిన ఉపవాస దీక్ష చేస్తారు. దీక్ష పూర్తయిన తర్వాత కన్నెపూజలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఉపవాస దీక్ష ముగించుకున్న యోగి బుధవారం నాడు కన్నెపూజలు నిర్వహించారు.