మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (13:03 IST)

కరిచిన పామును కరకర నమిలేశాడు.. ఎవడు?

పాము కరిచిందంటే ఏం చేస్తారు? కరిచిన పామును చూసి జడుసుకుంటారు. లేదంటే.. పరుగులు తీస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. తనను కరిచిన పామును ఓ వ్యక్తి కరకర నమిలేశాడు. ఇంకా కోపంతో పా

పాము కరిచిందంటే ఏం చేస్తారు? కరిచిన పామును చూసి జడుసుకుంటారు. లేదంటే.. పరుగులు తీస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. తనను కరిచిన పామును ఓ వ్యక్తి కరకర నమిలేశాడు. ఇంకా కోపంతో పామును నమిలేశాక సదరు వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్‌దోయి‌లో చోటుచేసుకుంది. కానీ పాము కరిచినట్లు ఆతని శరీరంలో గాట్లు లేకపోవడం వైద్యులకు షాకిచ్చింది.
 
వివరాల్లోకి వెళితే, సోనీలాల్ అనే వ్యక్తిని పాము కరిచిందని.. స్పృహ తప్పి పడిపోయాడని స్థానికులు వైద్యులకు ఫోన్ చేశారు. ఆంబులెన్స్ అతనిని ఆస్పత్రికి తరలించింది. అయితే అక్కడ అతనిని పరిశోధించిన వైద్యులు అతని శరీరంలో పాముకాటు లేని విషయాన్ని గమనించి షాక్ అయ్యారు. ఇంకా స్పృహలోకి వచ్చిన సోనీలాల్ వద్ద జరిగిందేమిటో అడిగి తెలుసుకున్నారు వైద్యులు. 
 
పశువులను మేపుతున్న సమయంలో సోనీలాల్‌ని పాము కరవడంతో అతనికి కోపం వచ్చి దాని తలను కొరికి నమిలేశాడని ఫార్మాసిస్ట్ హితేష్ కుమార్ తెలిపారు. అతని శరీరంపై పాము కాట్లు లేవని.. దాని తలను నమిలేయడంతోనే ఆ విషంతో అతను అపస్మారక స్థితిలో వెళ్లిపోయినట్లు తాను భావిస్తున్నానని హితేష్ చెప్పుకొచ్చారు. కానీ అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని.. అందుకే అలా చేశాడని.. రాష్ట్ర మానసిక ఆరోగ్య సంఘం కార్యదర్శి డాక్టర్ తివారీ తెలిపారు.