గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 జనవరి 2017 (15:10 IST)

జనాన్ని మూర్ఖుల్ని చేసి డబ్బు గుంజేస్తా..? ఓ వ్యక్తి ప్రధాని కాలేదా?:: చౌదరి

రాజకీయాల్లోకి వస్తే డబ్బు సంపాదించడం సులభమని అందరికీ తెలుసు. స్కామ్‌ల పేరిట కోట్లు దండుకునే అవినీతి రాజకీయ నేతలు ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కువ మంది ఉన్నారు. వీరి అడుగుజాడల్లో తాను కూడా నడుస్తానని ఉత్తర

రాజకీయాల్లోకి వస్తే డబ్బు సంపాదించడం సులభమని అందరికీ తెలుసు. స్కామ్‌ల పేరిట కోట్లు దండుకునే అవినీతి రాజకీయ నేతలు ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కువ మంది ఉన్నారు. వీరి అడుగుజాడల్లో తాను కూడా నడుస్తానని ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆగ్రా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చౌదరి అంటున్నారు. అక్రమార్కులు నిజం చెప్పరు. కానీ చౌదరి మాత్రం తన అంతరంగాన్ని స్పష్టంగా ఆవిష్కరించారు. 
 
రాజకీయాల్లో చేరడం వెనుక తన ఉద్దేశం కేవలం డబ్బు సంపాదించడమేనని కరాఖండీగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చూస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నవారి గురించి మాట్లాడుతూ వాళ్ళలాగే తాను కూడా సంపాదించుకుంటానంటున్నారు. 
 
తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రధాన కారణం డబ్బేనన్నారు. ఈ క్రమంలో తాను జనాలను మూర్ఖులను చేస్తానని చెప్పుకొచ్చారు. మరో అడుగు ముందుకేసి ''ఓ వ్యక్తి జనాన్ని మూర్ఖుల్ని చేసి ప్రధానమంత్రి కాగలిగాడంటే, అతనిలో ఏదో ప్రతిభ ఉందని అర్థం, నేను కూడా అదే బాటలో నడుస్తాను'' అంటున్నారు.