మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 జూన్ 2017 (10:35 IST)

యూపీలో లైంగికదాడి బాధితులు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు.. ఎందుకని?

ఉత్తరప్రదేశ్‌లో గతవారం నడిరోడ్డుపై లైంగిక దాడికి గురైన బాధితులు ఆత్మహత్యాయత్నం చేశారు. గతనెల 25న జరిగిన ఘటనపై పోలీసులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని.. అందుకే మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. మే 25న

ఉత్తరప్రదేశ్‌లో గతవారం నడిరోడ్డుపై లైంగిక దాడికి గురైన బాధితులు ఆత్మహత్యాయత్నం చేశారు. గతనెల 25న జరిగిన ఘటనపై పోలీసులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని.. అందుకే మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. మే 25న రాత్రి ఢిల్లీ నుంచి వస్తున్న ఓ వాహనాన్ని జేవార్‌లో దుండగులు అడ్డగించి దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే.
 
వాహనంలోని నలుగురు మహిళలపై లైంగికదాడికి పాల్పడటమే కాక, అడ్డుకోబోయిన బంధువును కాల్చి చంపారు. కాగా ఆదివారం ఉదయం ముగ్గురు బాధితులు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబీకులు వెల్లడించారు. మరో బాధితురాలు కూడా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆత్మహత్యాయత్నం చేశారని చెప్పారు. మరోవైపు కేసు దర్యాప్తు కొనసాగుతు న్నదని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ లవ్‌ కుమార్‌ వెల్లడించారు.