శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (14:41 IST)

ఇద్దరు మహిళలపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య.. చివరికి?

ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన భర్తను వీడియో తీసిన భార్య బెదిరింపులకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లో ముజాఫర్ నగర్‌కు చెందిన సంజీవి లోహన్ అనే వ్యక్తి ఇద్దరు మహిళలను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ తతంగాన్ని సంజీవి భార్య అతనికి తెలియకుండా వీడియో తీసింది. కొద్ది రోజుల అనంతరం సంజీవి అత్యాచారానికి పాల్పడిన మహిళల్ని ఆ వీడియో చూపించి బెదిరించి.. మళ్లీ అత్యాచారానికి పాల్పడాలనుకున్నాడు. 
 
కానీ సంజీవి భార్య తాను తీసిన వీడియోను భర్తకు చూపెట్టింది. అంతేగాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు ఈ వీడియోలను ఫార్వర్డ్ చేస్తానని బెదిరింది. దీంతో భర్త షాకయ్యాడు. అంతేగాకుండా సంజీవి చేత అత్యాచారానికి గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంజీవిని పోలీసులు అరెస్ట్ చేశారు.