గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మే 2023 (16:32 IST)

భారత రక్షణ రంగం మరో రికార్డు.. లక్ష కోట్లు దాటిన?

Indian Army
భారత రక్షణ రంగం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రక్షణ రంగంలోని ఉత్పత్తి తొలిసారి లక్ష కోట్ల రూపాయల మైలు రాయిని చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం భారత రక్షణ ఉత్పత్తుల విలువల లక్ష కోట్ల రూపాయలు దాటిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
తాజాగా నమోదైన రక్షణ రంగంలోని ఉత్పత్తుల విలువ 1.06 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని సైనిక అధికారిక వర్గాలు తెలిపాయి. 2021-22లో 95,000 కోట్ల రూపాయలతో పోలిస్తే 2022-23లో రక్షణ ఉత్పత్తి విలువ 12 శాతం పెరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.