మామిడాకుల కషాయం ఉపయోగం ఏమిటంటే....
మామిడికాయ. మామిడి కాయలు సీజన్ వచ్చేస్తోంది. మామిడి కాయల తినేందుకు రుచిగా మాత్రమే కాదు, వీటిలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. చిగుర్లు, దంతాలు బలహీనంగా వున్నవారు మామిడిపుల్లతో రెండుపూటలా పళ్లు తోముతుంటే దంతాలు, చిగుళ్లు గట్టిపడతాయి. గ్లాసు నీటిలో రెండు మామిడాకులు నలగ్గొట్టివేసి సగానికి మరిగించి వడపోసి గోరువెచ్చగా కషాయాన్ని పుక్కిలిస్తుంటే చిగుర్లవాపులు, నొప్పులు, నోటిపూత తగ్గుతాయి.
మామిడాకుల మధ్య వుండే ఈనెలను ఎండించి కాల్చి మసి చేసి నీరు కలిపి ఆ మిశ్రమాన్ని కంటిరెప్పలపైన వచ్చిన పులిపిర్లకు లేపనం చేస్తే తగ్గిపోతాయి.
మామిడాకు విస్తరిలో భోజనం చేయడం ఆరోగ్యదాయకం, దీనివల్ల ఆహారం రుచి పెరిగి శరీరంలో వేడి తగ్గిపోతుంది. మామిడిబెరడును మంచినీటితో సానరాయిపైన అరగదీసి ఆ గంధాన్ని కణతలకు పట్టువేస్తే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.
రాలిపడిన మామిడిపిందెలను ముక్కలు చేసి ఎండించి జల్లించిన పొడి 3 గ్రాములు, పంచదార 3 గ్రాములు కలిపి రెండుపూటలా సేవిస్తే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. మామిడిజీడి ఉసిరికకాయబెరడు సమంగా కలిపి ఆవుపాలతో నూరి ఆ మిశ్రమాన్ని పైన రుద్దుతుంటే పేనుకొరుకుడు తగ్గి తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి.