శుక్రవారం, 1 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 15 మార్చి 2023 (19:12 IST)

బిళ్ల గన్నేరు ఆకుల రసాన్ని పరగడుపున తాగితే?

Billa Ganneru
బిళ్ల గన్నేరు. ఈ మొక్కను చాలామంది గమనించే వుంటారు. తోటల్లో ఇవి కనబడుతాయి. ఈ మొక్కలో వున్న ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవి ఏమిటో తెలుసుకుందాము. బిళ్ల గన్నేరు ఆకులు లేదా పువ్వులు రెండుమూడు నమిలి తింటే షుగర్ అదుపులో వుంటుంది.
బిళ్ల గన్నేరు ఆకురసం, వేర్లు మెత్తగా పేస్టులా చేసి ఎండబెట్టి డికాషన్ కాచుకుని తాగితే క్యాన్సర్ వ్యాధి వెనకాడుతుంది. హైబీపీ వున్నవారు బిళ్లగన్నేరు ఆకుల రసం తీసి పరగడుపున ఓ టీ స్పూన్ మోతాదులో తాగితే బీపీ కంట్రోల్ అవుతుంది.
 
గాయాలు, పుండ్లు అయినప్పుడు బిళ్లగన్నేరు ఆకుల రసాన్ని వాటిపై కట్టులా వేస్తే తగ్గిపోతాయి.
2 కప్పుల మంచినీటిలో 8 బిళ్లగన్నేరు ఆకులు వేసి అరకప్పు వచ్చేదాకా మరిగించి ఆ నీటిని తాగితే స్త్రీలు రుత సమయంలో వచ్చే తీవ్రరక్తస్రావం, నొప్పి తగ్గుతాయి. పురుగులు, కీటకాలు చర్మంపై కుట్టినప్పుడు వచ్చే దద్దుర్లు, దురద తగ్గాలంటే బిళ్లగన్నేరు ఆకుల రసం అప్లై చేయాలి.
బిళ్లగన్నేరు ఆకుల రసాన్ని తీసుకుంటుంటే మానసిక సమస్యలు తగ్గి మంచినిద్ర పడుతుంది.
బిళ్లగన్నేరు ఆకులను ఎండబెట్టి పొడిచేసి దానికి వేపాకు పొడి, పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.