గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 13 మార్చి 2023 (23:42 IST)

తెల్ల గలిజేరు ఉపయోగాలు తెలుసా?

Beauty
పునర్నవ లేదా గలిజేరు. ఈ మొక్క భూమి పిచ్చిమొక్కలా కనిపిస్తుంది కానీ ఇందులో అద్భుతమైన ఔషధీయ విలువలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పునర్నవ మొక్క ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో వుంటుంది, ఐతే తెలుపు మొక్క ఉత్తమం అంటారు. తెల్లగలిజేరును వేడి నీటిలో మరిగించి తాగితే కఫం, దగ్గు, పాండు రోగాలు, వాత వ్యాధులు నయమవుతాయి.
 
మూత్రపిండాలను బాగు చేసి సక్రమంగా పనిచేసేలా పునర్నవ దోహదం చేస్తుంది. తెల్ల గలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. పునర్నవ మొక్కను నూరి రసం తీసి దానికి సమంగా నువ్వుల నూనెని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగపై కాచి వాత నొప్పులకు రాస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తీవ్రమైన గుండె సమస్యలున్నవారు, రక్తపోటు, మధుమేహం వున్నవారు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. పాలిచ్చే తల్లులు, గర్భిణీలు పునర్నవ ఆకు కూరను తినకూడదు.