మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (22:43 IST)

రావి చెట్టు బెరడు కషాయం తాగితే?

peepal leafs
రావిచెట్టు ఆకులు. వీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. శరీరంపై ఏర్పడిన గాయాలను నయం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇంకా రావిచెట్టు భాగాలంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
చర్మం పైన ముడతలు నివారణ యాంటీ ఆక్సిడెంట్లు రావిచెట్టు వేళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి.
 
రావిచెట్టు వేర్ల చివర్లను కోసి నీళ్లలో నానబెట్టి గ్రైండ్ చేసి, దాని పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే ముడతలు పోతాయి.
 
10 గ్రాముల రావిచెట్టు బెరడు, కాచుతుమ్మ, 2 గ్రాముల ఎండుమిర్చి మెత్తగా నూరి క్రమం తప్పకుండా బ్రష్ చేస్తే దంతాలు పటిష్టమౌతాయి.
 
ఉబ్బసం తగ్గేందుకు రావి బెరడు బాగా మేలు చేస్తుంది.
 
బెరడు లోపలి భాగాన్ని తీసి ఎండబెట్టి, మెత్తగా రుబ్బి దాని పొడిని ఆస్తమా రోగికి ఇస్తే ఉపశమనం లభిస్తుంది.
 
పాదాల మడమలు పగిలినప్పుడు రావి ఆకుల పాలను పూయడం ద్వారా పగిలిన మడమలు సాధారణమవుతాయి.
 
రావి బెరడుతో చేసిన కషాయం అరకప్పు తాగితే, రింగ్‌వార్మ్, గజ్జి, దురద వంటి చర్మ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.