గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 6 జనవరి 2023 (18:34 IST)

ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఏమవుతుంది?

garlic
వెల్లుల్లిని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
 
పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది.
 
వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
 
అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల శరీరంలోని అదనపు చెడు కొవ్వులు తగ్గుతాయి.
 
వెల్లుల్లి తినడం వల్ల క్యాన్సర్, మధుమేహం, అల్జీమర్స్, గుండె జబ్బులు వంటి వాటిని అడ్డుకోవచ్చు.
 
పొట్టు తీసిన వెల్లుల్లిని తేనెలో 10 రోజులు నానబెట్టి ఖాళీ కడుపుతో తినాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.