ఆదివారం, 26 మార్చి 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified శుక్రవారం, 28 అక్టోబరు 2022 (22:00 IST)

వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

garlic-honey
తేనె, వెల్లుల్లి రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల 5 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముందుగా వెల్లుల్లి, తేనె కలిపి ఎలా తినాలో తెలుసుకుందాము. వెల్లుల్లిని తొక్క తీసి తేలికగా దంచి దానికి తేనె కలపండి. వెల్లుల్లిలో తేనె కలిపిన తర్వాత దానిని సేవించాలి.

 
ఉదయం ఖాళీ కడుపుతో తినాలని గుర్తుంచుకోండి. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 
ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తేనె, వెల్లుల్లి రెండూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా, గొంతు నొప్పి, వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. జలుబును నివారించడానికి ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది.