గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (22:34 IST)

ఆముదం నూనెతో అమోఘమైన ప్రయోజనాలు

Massage
ఇప్పుడంటే బేబీ ఆయిల్స్ అంటూ మార్కెట్లోకి సీసాల్లో ఏవేవో వస్తున్నాయి. కానీ ఇదివరకు శిశువు ఆరోగ్యం కోసం అందరూ ఆముదం వాడేవారు. చక్కగా బిడ్డకు ఆముదం నూనెతో మసాజ్ చేసి తలకు ఆముదం రాసి స్నానం చేయించేవారు. దాంతో పిల్లలు ఆరోగ్యంగా వుండేవారు. ఆముదం నూనెతో కలిగే ప్రయోజనాలను ఒకసారి చూద్దాం.
 
ఆముదం నూనెకి బ్యాక్టీరియాను చంపే గుణం ఉంటుంది. లేత పసుపు రంగులో ఉండే ఆముదం విరేచనకారి. ఇది లూబ్రికెంట్‌గా నూనెతో కూడిన ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతుంది. నులి పురుగులు, మలబద్ధకం నివారణ కోసం ఆముదాన్ని విరివిగా వాడతారు.
 
ఆముదంతో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఎండ వల్ల కమిలిన చర్మం సాధారణ స్థితికి తెచ్చేందుకు ఆముదం అప్లై చేయాలి. ఆముదం చర్మం మీద అప్లై చేస్తే బిగుతుగా తయారై ముడతలు తగ్గుతాయి. ఆముదంలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. జుట్టు పెరుగుదలకు ఆముదం నూనె ఎంతో మేలు చేస్తుంది.