గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (19:50 IST)

బిల్డర్లకు డబ్బులకు బదులు పుచ్చకాయలు..

చైనాలో ఇళ్లు కొనుక్కున్నవారు బిల్డర్లకు డబ్బులు ఇవ్వటంలేదు. డబ్బులకు బదులు పుచ్చకాయలు, గోధుమలు, వెల్లుల్లి వంటివి ఇస్తునన్నారు. అలా చైనీయులు ఇచ్చి పుచ్చకుంటున్నారు. దీనికి కారణం చైనాలో పెరిగిన ఆర్థిక సంక్షోభం. దీంతో బిల్డర్లు ఇళ్లు కొనేవారు లేక అల్లాడిపోతున్నారు. 
 
ఇల్లు కొనుక్కుంటే పుచ్చకాయలు లేదా మీ  వద్ద వున్నవి ఇవ్వండి అంటూ బోర్డులు పెడుతున్నారు.  రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోవటంతో బిల్లర్డు ఈ మార్గం అనుసరిస్తున్నారు.
 
వరుస కోవిడ్‌ లాక్‌డౌన్లు, ఉక్రెయిన్‌-రష్యా యుద్దంతో ఎన్నో దేశాలతో పాటు ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనాలో కూడా ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతోంది. అక్కడి పారిశ్రామిక, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. 
 
సెంట్రల్‌ చైనాలోని హెనిన్ ప్రావిన్స్‌లో రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలింది. నిర్మించిన ఇళ్లను అమ్మడానికి అక్కడి డెవలపర్స్‌ అష్టకష్టాలు పడుతున్నారు. 
 
గత్యంతరం లేక ఇళ్లను నగదుకు బదులు గోధమలు, వెల్లుల్లి,పుచ్చకాయల రూపంలో చెల్లింపులు చేయాలని ఆఫర్లు ఇస్తున్నారు. అయినా ఇళ్ల కొనుగోలుకు అక్కడి ప్రజలు ముందుకు రావడం లేదు.