శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (15:34 IST)

పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌ వుంచుతున్నారా?

అవును.. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల దాని పోషక విలువలు తగ్గుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. 
 
తాజా పుచ్చకాయలో సిట్రులిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది.  ఫ్రిజ్‌లో వుంచితే  ఆ పోషకం మాయమవుతుంది. ఒకవేళ చల్లని పుచ్చకాయ తినవలసి వస్తే, పుచ్చకాయ స్మూతీ లేదా మిల్క్ షేక్ చేసి తీసుకోవచ్చు.
 
అయితే వేడి వాతావరణంలో రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పుచ్చకాయ ముక్కను తింటే చాలా మంచి అనుభూతి కలుగుతుంది. కానీ, పూర్తి పోషకాహారం అందాలంటే మాత్రం చల్లటి పుచ్చకాయ తినడం బంద్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.