గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 4 జనవరి 2023 (22:54 IST)

గుమ్మడి గింజలు తింటే ఏం జరుగుతుంది?

pumpkin
విటమిన్ ఇ, కెరోటినాయిడ్స్ ఉండటం వల్ల గుమ్మడికాయ గింజలు గొప్ప యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము.
 
గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పురుషులకు గొప్ప శక్తినిస్తాయి.
 
గుమ్మడికాయ గింజలను తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్, బ్రెస్ట్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.
 
గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
 
విటమిన్ ఇ, జింక్ ఉండటం వల్ల గుమ్మడి గింజలు మన రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి.
 
గుమ్మడి గింజల్లో ఉండే అమినో యాసిడ్ ట్రిప్టోఫాన్ నిద్రకు మంచిది.
 
గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం ఎముకల పెరుగుదలకు, బలానికి మంచిది.
 
గుమ్మడి గింజల్లోని జింక్ శిశువు యొక్క ఆరోగ్యకరమైన పెరుగుదలకు సహాయపడుతుంది.
 
గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల మన జుట్టు బలంగా తయారవుతుంది.