సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (09:08 IST)

జగన్మాత సాక్షాత్కారం కాలేదని కత్తితో గొంతుకోసుకున్న భక్తుడు!!

suicide
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ మూఢ భక్తుడు కత్తితో గొంతు కోసుకున్నాడు. జగన్మాత సాక్షాత్కారం కాలేదని గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగన్మాత సాక్షాత్కారం కోసం 24 గంటల పాటు తపస్సు చేసిన ఆ మూఢ భక్తుడు.. చివరి ఈ పనికి పాల్పడ్డాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వారణాసి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఇషాన్ సోనీ తెలిపిన వివరాల ప్రకారం.. కాళీ మాత అంటే అమితమైన భక్తి ఉన్న అమిత్ శర్మ జగన్మాత ప్రత్యక్షం కోసం తన గదిలో శనివారం తపస్సు ప్రారంభించాడు. కాళీమాత తన ముందు ప్రత్యక్షం అవుతుందని అతను చెప్పాడట. తల్లీ.. ప్రత్యక్షం అవ్వు.. అంటూ ధ్యానం సందర్భంలో అతను ఉచ్చరించాడట. అయితే.. ఎన్ని గంటలు గడచినా జగన్మాత ప్రత్యక్షం కాకపోవడంతో నిరాశకు గురైన అతను చివరకు కత్తితో తన గొంతు కోసుకున్నాడని అసిస్టెంట్ కమిషనర్ ఇషాన్ సోనీ తెలిపారు.
 
అమిత్ శర్మ గత ఏడేళ్లుగా తన ఇంట్లో అద్దెకు ఉంటున్నాడని ఇంటి యజమాని తెలిపాడు. తరచూ అతను తీర్థ యాత్రలకు వెళ్లేవాడని, కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించే వాడని పేర్కొన్నాడు. కాగా, అమిత్ శర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.