శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 13 జులై 2024 (14:45 IST)

పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదికి విష సర్పాలు కాపలా?

snake
పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదిని ఆదివారం నాడు తెరవబోతున్నారు. ఈ గదిని 46 ఏళ్ల క్రితం తెరిచినట్లు ఆలయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఐతే ఈ రహస్య గదిలోని రత్న భాండాగారానికి విష సర్పాలు కాపలా వున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనితో ముందుజాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ పాము కాటేసినా వెంటనే వైద్యం చేయించేందుకు వైద్యులను సిద్ధం చేసారు. కాగా కర్ర పెట్టెల్లో దాచిన పూరీ జగన్నాథని సంపద ఎంత అనే విషయమై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని వుంది.
 
అసలు పూరీ జగన్నాథుని ఆలయం అంటేనే ఎన్నో అద్భుతాలతో కూడుకుని వుంటుంది. ఇక్కడ ప్రకృతి నియమావళిని ధిక్కరిస్తూ ఈ ఆలయ గోపురంపై గాలికి వ్యతిరేక దిశలో జెండా రెపరెపలాడుతుంది. ఆలయ గోపురంపై ఉన్న జెండాను మార్చడానికి ప్రతిరోజూ పూజారి 45 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తుతో వున్న ఆలయ గోడలపైకి ఎక్కుతాడు. రోజులో ఏ సమయంలోనైనా సూర్యుని కిరణాలు ఆలయంపై పడినా దాని నీడ కనిపించదు, ఏ దిశలోనైనా అంతే, అది ఒక అద్భుతం. ఇలాంటి అద్భుతాలు ఇంకా ఆలయంలో ఎన్నో వున్నాయి.