గురువారం, 10 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 21 జూన్ 2016 (13:32 IST)

గేదెకు వైద్యం కోసం వచ్చి.. గృహిణిపై పశువులా లైంగిక దాడికి తెగబడిన డాక్టర్.. ఎక్కడ?

వైద్యో నారాయణో హరి అన్నారు మన పెద్దలు. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాడో వైద్యుడు. గేదెకు వైద్యం చేసేందుకు ఇంటికి వచ్చిన ఓ పశువుల డాక్టర్.. ఆ ఇంటి గృహిణిపై లైంగికదాడికి

వైద్యో నారాయణో హరి అన్నారు మన పెద్దలు. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాడో వైద్యుడు. గేదెకు వైద్యం చేసేందుకు ఇంటికి వచ్చిన ఓ పశువుల డాక్టర్.. ఆ ఇంటి గృహిణిపై లైంగికదాడికి తెగబడ్డాడు. బాధితురాలు, ఆమె భర్త చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వైద్యుడిని అరెస్టు చేశారు.
 
పోలీసుల వివరాల ప్రకారం... ముజఫర్‌నగర్‌లోని కాతుబ్పూర్ అనే గ్రామంలో తమ గేదెకు సుస్తి చేయడంతో వైద్యం చేసేందుకు రావాల్సిందిగా కోరడంతో రామ్ నివాస్ అనే పశువుల డాక్టర్ ఆ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో భర్త లేని విషయాన్ని గమనించి... ఇదే అదనుగా భావించిన 35 ఏళ్ల గృహిణిపై పశువులా లైంగిక దాడికి దిగాడు. అనంతరం ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు. జరిగిన విషయం ఆమె భర్తకు చెప్పడంతో... ఆక్రోషంతో ఊగిపోయిన ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు.