మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (17:06 IST)

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..?

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో మైనర్ బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సెప్టెంబరు 7న ఇమాలియా సుల్తాన్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక మార్కెట్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఆమెను షీబు, నజీమ్ అనే ఇద్దరు యువకులు అనుసరించారు. నిర్మానుష్యం ప్రాంతంలోకి రాగానే ఆమెను సమీపంలోని చెరుకుతోటలోకి ఎత్తుకెళ్లారు. అక్కడ మరో ముగ్గురు ఉన్నారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై ఆ ఐదుగురు యువకులు లైంగికదాడి చేశారు. 
 
ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు. అంతేకాదు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలికపై లైంగికదాడి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వీడియో వైరల్ కావడంతో బాధితురాలికి మహిళా సంఘాలు అండగా నిలిచాయి. వారు ధైర్యం చెప్పడంతో ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ వీడియో ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు శీబును అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నారు.