మంగళవారం కుబేర స్థానాన్ని చూస్తూ నిద్రలేస్తే..? (video)

Kubera
Kubera
సెల్వి| Last Updated: మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (10:37 IST)
మంగళవారం కుబేర స్థానాన్ని చూస్తూ నిద్రలేస్తే..? కోరిన కోరికలు నెరవేరుతాయి. పడకగదిలో దక్షిణం వైపు తలపెట్టుకుని నిద్రించాలి. ఉదయం ఉత్తరదిక్కుగా అంటే కుబేరస్థానాన్ని చూస్తూ నిద్రలేవడం మంచిది. శుభకరమైనది.

అలాగే ప్రతి మంగళ, గురు, శుక్రవారాల్లో, అష్టమీ, నవమి, దశమి, త్రయోదశి, పౌర్ణమి, శుద్ధ పాడ్యమీ తిథుల్లో శ్రీ మహాలక్ష్మిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ధనాదాయం పొందాలంటే.. ఈతిబాధలు తొలగిపోవాలంటే.. మంగళవారం పూట శ్రీ లక్ష్మిని అర్చించి.. శ్రీసూక్తిని 3 సార్లు పఠించాలి.

మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు చేకూరుతాయి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారికి దీపారాధను నైవేద్యాలు చేయడం వలన అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. దానికి తోడుగా ఈ మంత్రాన్ని జపిస్తే...

''చతుర్భుజం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టం శివాం శివకరీం సతీమ్'' అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితువు చెప్తున్నారు.


దీనిపై మరింత చదవండి :