మంగళవారం.. హనుమంతునికి ఐదు అరటి పండ్లు సమర్పిస్తే? (video)

lord Hanuman
lord Hanuman
సెల్వి| Last Updated: మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (10:39 IST)
శ్రీరామచంద్రుని భక్తాగ్రేసరుల్లో ఆంజనేయ స్వామి అగ్రగణ్యుడు. రామాయణంలో సీతాన్వేషణలో శ్రీరామునికి ఇతోధికంగా సాయపడిన వానరుడు హనుమంతుడు. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఆయన అంజనాదేవి, కేసరి దంపతులకు జన్మించాడు. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టడంతో అశేష బలసంపన్నుడిగా అవతరించారు.

చిరంజీవిగా వుంటూ శ్రీరామనామం శబ్దం విన్నంతనే అక్కడకు ప్రత్యక్షమవుతాడని కోట్లాది భక్తుల నమ్మకం. అలాంటి హనుమంతుడిని మంగళవారం పూట
పూజించడం ద్వారా అప్పుల బాధలను, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

మంగళవారం సూర్యోదయానికి ముందే లేచి ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని... శుచిగా స్నానమాచరించి... పూజకు అగరబత్తులు, అరటిపండ్లు, శుభ్రమైన నీరు, పువ్వులు, కుంకుమ సిద్ధం చేసుకోవాలి. పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. నిష్ఠతో హనుమాన్ యంత్రాన్ని పఠించాలి. మంగళవారం పూట శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఐదు అరటి పండ్లను హనుమాన్‌కు సమర్పించినా సరిపోతుంది. ఇలా 21 మంగళవారాలు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా హనుమాన్ పూజ చేయాలి. హనుమాన్ చాలీసాతో 15 నిమిషాలు హనుమంతుడిని ధ్యానించాలి.

బెల్లం ముక్కను, అరటిపండ్లు, తమల పాకులు సమర్పించి స్వామికి దీపారాధన చేయాలి. ఇలా ప్రతీ మంగళవారం పూట హనుమంతుడిని పూజిస్తే.. సమాజంలో గౌరవం, ధైర్యం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉపాధి అవకాశాలు చేకూరుతాయి. సంతానం కలుగుతుంది. ఈతి బాధలుండవు. ముఖ్యంగా పురుషులు ఈ వ్రతాన్ని చేస్తే విశిష్ట ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

దీనిపై మరింత చదవండి :