గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జులై 2020 (11:17 IST)

మీవల్లే అతనికి ఈ గతి: మీడియాపై వికాస్‌ దూబే భార్య మండిపాటు

మీడియా వల్లే గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేకు ఈ గతి పట్టిందంటూ ఆయన భార్య రిచా ఆగ్రహం వ్యక్తంచేశారు. రిపోర్టర్లే ఇందుకు కారణమని నిప్పులు చెరిగారు.

వికాస్‌ చాలా పెద్ద తప్పు చేశాడని, అతనికి చావు ఇలా రాసి పెట్టి ఉందని వ్యాఖ్యానించారు. పోలీసులపై మారణకాండకు పాల్పడ్డ వికాస్‌ ఇలాంటి చావుకు అర్హుడే అని చెప్పారు.

కాన్పూర్‌లోని భైరోఘాట్‌లో వికాస్‌ దూబే అంత్యక్రియల్లో రిచా పాల్గొన్నారు. ఆమె వెంట కుమారుడు, తన తమ్ముడు దినేష్‌ తివారీ ఉన్నారు.

దూబే మృతదేహానికి ఎలక్ట్రిక్‌ క్రిమేషన్ మెషీన్‌లో.. అతని బావమరిది దినేష్‌ తివారీ అంత్యక్రియలు నిర్వహించారు. ఈక్రమంలో వికాస్‌ ఎన్‌కౌంటర్‌ కావడంపై రిచా స్పందించారు.