1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (09:09 IST)

పబ్లిక్‌ ప్లేసులో సివిక్ ఇంజనీర్‌కు చెప్పిందెవరు?

MLA
MLA
మహారాష్ట్రలోని థానేకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ మహిళా ఎమ్మెల్యే పబ్లిక్‌ ప్లేసులో ఓ సివిక్ ఇంజనీర్‌ను చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలను వస్తున్నాయి.
 
వివరాల్లోకి వెళితే... మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు ఇంజనీర్లతో మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్ వాగ్వాదానికి దిగినట్లు ఫుటేజీలో కనిపిస్తోంది. 
 
కొన్ని నిర్మాణాల కూల్చివేతలో ఇంజనీర్ల ప్రమేయం కారణంగా వాగ్వాదం తలెత్తిందని, వర్షాకాలం రాక కొన్ని రోజుల ముందు పిల్లలతో సహా ఆక్రమణలకు ఆశ్రయం లేకుండా పోయింది. 
 
ఘర్షణ సమయంలో, కూల్చివేతలను నిర్వహించడానికి వారి అధికారాన్ని ప్రశ్నిస్తూ, ఇంజనీర్లను గీతా జైన్ తిట్టడం కనిపిస్తుంది. తమ చర్యలను సమర్థించుకునేందుకు సాక్ష్యంగా ప్రభుత్వ రిజల్యూషన్ (జీఆర్)ను అందించాలని ఆమె డిమాండ్ చేశారు.