ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (15:06 IST)

అగ్రహార జైలులో సమస్యల్లేవ్.. చెన్నై జైలుకు రానన్న చిన్నమ్మ..

అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తనను చెన్నై జైలుకి మార్చాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆదాయానికి మించిన కేసులో శిక్ష అను

అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తనను చెన్నై జైలుకి మార్చాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆదాయానికి మించిన కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు మెరుగైన సేవలు అందించేందుకు తమిళనాడులోని జైలుకు చిన్నమ్మను తరలించాలని పళనిస్వామిని ఆదేశించాల్సిందిగా ఆమె తరపు న్యాయవాదులు సూచించినట్టు సమాచారం. 
 
అయితే దీనిని చిన్నమ్మ తోసిపుచ్చారని తెలుస్తోంది. పరప్పన అగ్రహార జైలులో సమస్యలు లేవని, తమిళనాడు జైలులో ఉంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. పరప్పన అగ్రహార జైలులో శశికళతో న్యాయవాదులతో పాటు దినకరన్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై తరచూ ములాఖాత్ అవుతున్న సంగతి తెలిసిందే.