సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (15:02 IST)

బాహుబలి అవతారంలో హరీష్ రావత్.. ఉత్తరాఖండ్‌ను ఎత్తేశాడు.. మోడీ అవాక్కయ్యారు..

దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అందులో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో

దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అందులో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ బాహుబలి అవతారం ఎత్తారు. బాహుబలి పాటను కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటోంది. 
 
బాహుబలి చిత్రంలోని 'ఎవ్వరంట.. ఎవ్వరంట నిన్ను ఎత్తుకుంది' అనే పాట అందరి నోట్లో ఇప్పటికీ నానుతోంది. తన తల్లి బిందెలో కింద నుంచి నీళ్లు తీసుకొని వచ్చి పైన ఉన్న శివలింగానికి పోస్తుంది. తన తల్లికి కష్టం కలగకుండా ఉండేందుకు ప్రభాస్.. శివలింగానికి అభిషేకం జరిగేలా జలధార కింద పెడతాడు. ఇప్పుడు అదే పాటను హరీష్ రావత్‌కు అనువదించారు. 
 
ఈ పాట బ్యాక్ గ్రౌండుతోనే బాహుబలి 2 పేరిట ఉత్తరాఖండ్‌లో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బాహుబలిలా హరీష్ రావత్ కనిపిస్తారు. ప్రభాస్ శివలింగాన్ని ఎత్తితే.. రావత్ ఉత్తరాఖండ్‌ను తన భుజస్కందాలపై పెట్టుకున్నారు. దీనిని స్వయంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధం చేసి విడుదల చేయగా, హరీష్ రావత్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి షేర్ చేసారు. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధమైన ప్రాంతాల ఫోటోలు కనిపిస్తాయి. మరో విషయం ఏమంటే.. రావత్ ఉత్తరాఖండ్‌ను భుజంపై పెట్టుకొని నడుస్తుండగా బీజేపీ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ అవాక్కయినట్లుగా కనిపిస్తారు. తనికెళ్ల భరణి స్థానంలో మోడీ కనిపిస్తారు. అసలు వీడియోను ఎడిట్ చేసి ముఖాలను మాత్రమే మార్చారు. ఈ వీడియోకు దేశ వ్యాప్తంగా లైకులు వెల్లువెత్తుతున్నాయి.