బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (20:23 IST)

ప్రియురాలికి పెళ్లి ఫిక్స్, మాజీ లవర్ ఎంత పనిచేశాడంటే?

ప్రేమ-ఆప్యాయతలు మంటగలిసిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ల యుగం గడుస్తోంది. ఇందులో మమకారం, ఆప్యాయతలు కనుమరుగవుతుంది. ప్రేమ కూడా స్మార్ట్‌గా మారింది. దీంతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా తనను ప్రేమించిన యువతి వేరొక వ్యక్తిని పెళ్లాడబోతోందని తెలిసి.. ఆమె ప్రియుడు అకృత్యానికి పాల్పడ్డాడు.

 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని సుబ్రమణ్యపురకు 23 ఏళ్ల యువతికి నాలుగు సంవత్సరాల క్రితం దిలీప్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరి స్నేహం రాస్త ప్రేమగా మారింది. ప్రేమించిన యువతికి మాయమాటలు చెప్పి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె ప్రియుడు దిలీప్ ఆమె నగ్న ఫోటోలు, ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో సీక్రేట్‌గా వీడియోలు తీసి పెట్టుకున్నాడు.

 
అయితే ప్రేయసిపై అతనికి అనుమానాలు ఎక్కువయ్యాయి. సాటి అబ్బాయిలతో మాట్లాడకూడదని ప్రేయసిని వేధించసాగాడు. ఇలా ప్రియురాలికి కండీషన్లు పెడుతూ వచ్చాడు. రానురాను వారిద్దరి మధ్య తేడా వచ్చింది. దీంతో ప్రియురాలు ప్రియుడికి దూరమైంది.

 
మరోవైపు దిలీప్ ప్రియురాలుకు బెంగళూరులోనే నివాసం ఉంటున్న వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిగిపోయింది. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి పనులు చేసుకుంటున్నారు. మాజీ ప్రియురాలికి పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలుసుకున్న ఆమె మాజీ ప్రియుడు దిలీప్ రగిలిపోయాడు.

 
ఆమె నగ్న ఫోటోలను పెళ్లికొడుకుకు పంపాడు. కాబోయే భార్య నగ్న ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అయిన పెళ్లి కొడుకు కుటుంబీకులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు ఆమె మాజీ ప్రియుడు దిలీప్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దిలీప్‌ను అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.