మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (10:40 IST)

విధి vs ప్రేమ.. విక్రమాదిత్య ఏం చేస్తాడు.. (ట్రైలర్)

విధి vs ప్రేమ కాన్సెప్ట్‌తో విక్రమాధిత్య అలరించేందుకు సిద్దమయ్యాడు. ఆయనెవరో కాదు రాధేశ్యామ్. ఈ సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ అభిమానుల ఆధ్వర్యంలో విడుదలైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 'రేయ్.. అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు. నా చేతిలో ప్రేమ, పెళ్లి లేవ్' అనే డైలాగ్‌తో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది.
 
ప్రేమ కోసం విధిని ఎదిరించే విక్రమాధిత్యగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. అదే సీన్‌లో పూజా హెగ్దె ఎంట్రీ కూడా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ 'గుడ్ లుకింగ్.. బ్యాడ్ ఫెలో'గా, 'ఐన్‌స్టీన్ ఆఫ్ పామ్‌మిస్టరీ'గా కనిపించనున్నాడు. 
 
ఈ సినిమాలో ప్రభాస్ నెవ్వర్ బిఫోర్‌లా కనిపించనున్నాడని అర్థం అవుతోంది. 'ప్రాణం పోసిన ప్రేమ ప్రాణాలు తీస్తుందా' అనే డైలాగ్‌తో ఎండ్ అయింది. ఈ డైలాగ్ అందరిలో ఉత్కంఠ రేపుతోంది.
 
అయితే ఈ సినిమా విధికి ప్రేమకి మధ్య యుద్ధాన్ని తలపించనుందని తెలుస్తోంది. మరి ఈ యుద్ధంలో విజయం ఎవరిదనేది తెలియాలంటే జనవరి 14 వరకు వేచి చూడాల్సిందే.