పెద్ద నోట్ల రద్దు: సొంతపార్టీకి మోడీ లీక్ చేశారా? కోటి రూపాయల డిపాజిట్.. అధి నల్లడబ్బా?
పెద్ద నోట్ల రద్దు వ్యవహారానికి రాజకీయ రంగు పులుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దుకు ముందే బెంగాల్‌కు చెందిన ఓ బీజేపీ నేత తన అకౌంట్లోకి కోటి రూపాయలు డిపాజిట్ చేసినట్లు గల ఆధారాలు వెలుగులో
పెద్ద నోట్ల రద్దు వ్యవహారానికి రాజకీయ రంగు పులుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దుకు ముందే బెంగాల్‌కు చెందిన ఓ బీజేపీ నేత తన అకౌంట్లోకి కోటి రూపాయలు డిపాజిట్ చేసినట్లు గల ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. తద్వారా నోట్ల రద్దు వల్ల బీజేపీ నేతలు లాభపడ్డారంటూ కాంగ్రెస్, ఆప్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు తీవ్ర ఆరోపణల్లో నిజమున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 8న బీజేపీ నేత చేసిన ముందస్తు డిపాజిట్ వివరాలు ప్రస్తుతం బయటపడ్డాయి. సొంతపార్టీకి లీకులిచ్చిన తర్వాతే మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రకటన చేశారని విమర్శిస్తున్నారు. అయితే ఈ వార్తలను బెంగాల్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఖండించారు. ఇదేమీ బ్లాక్‌మనీ కాదని, పార్టీకి వచ్చిన ఫండ్ అని, దీనిపై విచారణ జరిపిస్తే అధికారులకు లావాదేవీల డీటేల్స్ ఇస్తామని దిలీప్ ఘోష్ సవాల్ విసిరారు. అయితే నరేంద్ర మోడీ ప్రకటన ముందుగానే తెలుసుకుని డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేశారని సీపీఎం ఎమ్మెల్యే సుజన్ చక్రబర్తి విమర్శించారు.