ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 28 మే 2020 (08:31 IST)

గోరఖ్‌పూర్‌ గబ్బిలాలకు ఏమైంది?

గోరఖ్‌పూర్‌లోని బెల్గాట్‌ ప్రాంతంలో పెద్దసంఖ్యలో చనిపోయిన గబ్బిలాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఉదయం మామిడితోటకు వెళ్లగానే గుట్టలుగా చనిపోయి ఉండటం గమనించానని పంకజ్‌ షాహి బెల్ఘాట్‌ అనే రైతు తెలిపారు.

కరోనా వైరస్‌తోనే అవి చనిపోయి వుంటాయని భావించి వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చానని అన్నారు. వారు వచ్చేసరికి అధిక సంఖ్యలో గబ్బిలాలు పడి ఉన్నాయని చెప్పారు. అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని బరేలిలోని ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐవిఆర్‌ఐ)కి పరీక్ష కోసం పంపినట్లు తెలిపారు.

అయితే అవి వైరస్‌ కారణంగా చనిపోలేదని, అధిక వేడి, నీరు లేకపోవడంతో వడదెబ్బకు గురై మరణించామయని మరణించాయని తేల్చారు. ప్రజలు ఆందోళనకు లోనుకావద్దని, ప్రతి అంశానికి కరోనాయే కారణమని భావించడం సరికాదని అన్నారు.