శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (10:33 IST)

కోర్టుధిక్కరణ అంటే ఏమిటి?.. ధిక్కరణ రకాలు?

చాలా మందికి కోర్టు ధిక్కరణ అంటే తెలియకుండా  న్యాయస్థానాలు ఇచ్చిన  తీర్పులను తప్పబట్టడమే కాకుండా వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం లేక వ్రాతలు రాయడం లేక సోషియల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు సంబంధిత  న్యాయమూర్తుల మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడం జరుగుతుంది.

న్యాయస్థానం యొక్క ధిక్కారం అనేది చట్టం యొక్క అధికారం మరియు పరిపాలనను అగౌరవ పరచడం లేదా విస్మరించడం లేదా వ్యాజ్యం సమయంలో పార్టీలు లేదా వారి సాక్షులను జోక్యం చేసుకోవడం లేదా పక్షపాతం చూపడం జరుగుతుందని న్యాయవాది ఎస్.ఆర్.ఆంజనేయులు ఈ సందర్బంగా పేర్కొన్నారు
 
అయితే వాక్ స్వాతంత్ర్యం అనేది రాజ్యంగంలోని కోర్టు దిక్కరణ చర్యలకు లోబడి ఉంటుంది. కోర్టులను  నిస్సంకోచంగా విమర్శిస్తే శిక్షలు తప్పవని ప్రజలు నేడు తెలుసుకొనే సమయం వచ్చింది.
 
కోర్టు ధిక్కరణ రకాలు:
 
1.సివిల్ కంటెంప్ట్.   
2.క్రిమినల్ కంటెంప్ట్.
 
సివిల్ కంటెంప్ట్:
కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ 2 (బి) ప్రకారం ఏదైనా కోర్టు తీర్పు, ఆదేశం లేదా ఇతర కోర్టు ప్రక్రియలకు ఉద్దేశ పూర్వకంగానే అనుసరించక పోవడాన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తారు. కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం లేదా మాటను ఉద్దేశపూర్వకంగా అనుసరించకపోవడం కూడా దీని కిందకే వస్తుంది. కోర్టు ఆదేశాలను అనుసరించకపోతే సివిల్ కంటెంప్ట్ కిందకు వచ్చేస్తుంది
 
క్రిమినల్ కంటెంప్ట్ :
కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ 2 (సి) ప్రకారం, క్రిమినల్ ధిక్కారం ఏదైనా విషయం లేదా చేయడం యొక్క ప్రచురణ (పదాల ద్వారా, మాట్లాడే లేదా వ్రాతల ద్వారా, లేదా సంకేతాల ద్వారా, లేదా కనిపించే ప్రాతినిధ్యం ద్వారా లేదా మరే ఇతరత్రా చర్యలు ద్వారా) నిర్వచించబడింది. ఏ ఇతర చర్య అయినా క్రిమినల్ కంటెంప్ట్ కిందా పరిగణించడం జరుగుతుంది.

క్రిమినల్ కేసు అవ్వాలంటే తీర్పును తప్పుపట్టడం లేదా ప్రతిష్ఠను మసక బార్చేలా వ్యాఖ్యలు లేదా ప్రచురణలు చేయాల్సి ఉంటుంది.  దీనిలో మూడు రకాలున్నాయి. ఈ నిబంధనలను ప్రచురణ రూపంలో లేదా వ్యాఖ్యలు చేయడం, లేదా సంజ్ఞల రూపంలో ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ఆ నింధనలు ఏమిటంటే......
 
1) ఏదైనా కోర్టు గౌరవాన్ని దిగజార్చేలా చేయడం లేదా దూషణలకు పాల్పడటం
2) కోర్టు ప్రక్రయల్లో జోక్యం చేసుకొనేందుకు ప్రయత్నించడం లేదా పక్షపాతం చూపించడం
3) ఏదైనా చర్యల ద్వారా న్యాయ పరిపాలన ప్రక్రియలకు అడ్డు తగలడం.                                                                               
 
క్రిమినల్ కంటెంప్ట్‌తో పోలిస్తే సివిల్ కేసులు ఎక్కువగా వస్తాయని న్యాయవాది ఎస్.ఆంజనేయులు తెలిపారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ లోని సెక్షన్ 1(15) ప్రకారం క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు నేరుగా చర్యలు తీసుకోవచ్చు లేదా అటార్నీ జనరల్ లేదా అడ్వాకేట్ జనరల్ సమ్మతితో మరెవరైనా కేసులు నమోదు చేయొచ్చు.

“సాధాణంగా సుప్రీం, లేదా హైకోర్టులు తమకు తాముగానే కేసులను పరిగణలోకి తీసుకుంటాయి. అదే సాధారణ పౌరులు లేదా న్యాయవాదుల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కేసు నమోదు చేయాలంటే  సుప్రీం కోర్టు విషయానికి వస్తే అటార్నీ జనరల్ అనుమతి తీసుకోవాలి. అదే హైకోర్టు విషయంలో సంబంధిత రాష్ట్ర  అడ్వొకేట్ జనరల్ అనుమతి తీసుకోవాలి'' అని ఎస్.ఆర్. ఆంజనేయులు తెలిపారు.
 
కోర్టు ధిక్కరణ కింద శిక్షలు ఏమిటి?
కోర్టు ధిక్కరణ చర్యల కింద ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. లేదా రూ2000/‌-లు వరకు జరిమానా విధించొచ్చు. లేదా కొన్నిసార్లు రెండూ విధించవచ్చు. ఒక్కోసారి క్షమాణలు చెప్పడం ద్వారా ఈ శిక్షలను కోర్టులు మాఫీ చేస్తాయి. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ విషయంలో ఇలానే జరిగింది. ఆయన క్షమాపణలు చెప్పడానికి నిరాకరించడంతో రూ.1 జరిమానాను కోర్టు విధించింది.

“ప్రముఖులపై కూడా ఇలాంటి కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన దాఖలాలు”  ఉన్నాయి.  ఉదాహరణ కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన పుంజల శివ శంకరే కేసు నమోదు చేశారు కానీ ఆయనకు కోర్టు ఎలాంటి శిక్షా విధించలేదు. అయితే ప్రశాంత్ భూషణ్ కేసునూ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 
కోర్టుల ధిక్కార చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం
సబార్డినేట్ కోర్టులను ధిక్కారాలను శిక్షించే అదికారం హైకోర్టుకు ఉంది. ఇది  ప్రతి హైకోర్టుకు ఒకే విధమైన అధికార పరిధి, అధికారాలు
 
*మరియు అధికారాన్ని ఒకే విధానం మరియు అభ్యాసానికి అనుగుణంగా కలిగి ఉండాలి మరియు దానికి లోబడి ఉన్న న్యాయస్థానాల ధిక్కారాలకు సంబంధించి మరియు తనను తాను ధిక్కరించే విషయంలో వ్యాయామాలు "భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 45 ప్రకారం శిక్షార్హమైన నేరం అయిన ఒక న్యాయస్థానానికి సంబంధించి కట్టుబడి ఉన్నట్లు ఆరోపించిన ధిక్కారాన్ని ఏ హైకోర్టు కూడా తీసుకోదు.*
 
కోర్టు ధిక్కరణ కింద ఎప్పుడు చర్యలు తీసుకోవచ్చు? ఎలాంటి శిక్షలు విధిస్తారు?
కోర్టు ధిక్కారానికి శిక్షించే అధికారాన్ని హైకోర్టు, సుప్రీం కోర్టులకు ఇస్తారు.కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం, కోర్టు ధిక్కారాన్ని ఆరు నెలల వరకు పొడిగించే కాలానికి సాధారణ జైలు శిక్షతో లేదా రూ2000/-ల వరకు జరిమానాతో లేదా రెండింటితో శిక్షించవచ్చు.

అయితే, ఒక్కోసారి క్షమాణలు చెప్పడం ద్వారా ఈ శిక్షలను కోర్టులు మాఫీ చేస్తాయి. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ విషయంలో ఇలానే జరిగింది. ఆయన క్షమాపణలు చెప్పడానికి నిరాకరించడంతో రూ.1 జరిమానాను కోర్టు విధించింది.
 
ఏది ఏమైనాప్పటికీ, సివిల్ కేసులలో జరిమానా న్యాయం యొక్క చివరలను తీర్చదని మరియు జైలు శిక్ష అవసరమని కోర్టు భావిస్తే, అతన్ని సాధారణ జైలు శిక్షకు బదులుగా, అతన్ని సివిల్ జైలులో నిర్బంధించమని నిర్దేశిస్తుంది. ఆరు నెలలు మించకూడదు. ఈ విభాగం కింద నిర్దేశించిన దానికంటే ఎక్కువగా కోర్టు ధిక్కారానికి కోర్టు తనకు సంబంధించి లేదా దానికి లోబడి ఉన్న కోర్టుకు శిక్ష విధించాల్సిన అవసరం లేదు.

నిందితుడు డిశ్చార్జ్ కావచ్చు లేదా కోర్టు ఇచ్చిన సంతృప్తికి నిందితుడు క్షమాపణ చెప్పినందుకు ఇచ్చిన శిక్షను పంపవచ్చు. క్షమాపణ అనేది కేవలం నిందితుడు మంచి నమ్మకంతో చేస్తే అది అర్హత లేదా షరతులతో కూడుకున్నది అనే కారణంతో తిరస్కరించబడదు.
 
కాంటెంప్ట్ కొనసాగింపులో రక్షణలు
2006సంవత్సరంలో సవరణ నాటికి ఇటీవల ప్రవేశపెట్టిన కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్, 1971 లోని సెక్షన్ 13 లోని క్లాజ్ (బి), ప్రజా ధర్మానికి మరియు న్యాయస్థానం సంతృప్తి చెందితే  అటువంటి ధిక్కార సత్యం ద్వారా సమర్థన యొక్క రక్షణను పెంచడానికి నిందితులను అనుమతిస్తుంది.