సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 14 జులై 2021 (08:41 IST)

నీట్‌-ఎండీఎస్‌ ప్రవేశాలపై ఇంత జాప్యమేమిటి?: సుప్రీంకోర్టు

దంత వైద్యంలో మాస్టర్స్‌ డిగ్రీ (ఎండీఎస్‌) ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించడంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

నీట్‌-ఎండీఎస్‌ ప్రవేశాల కోసం 2020 డిసెంబరు 16న పరీక్షలు నిర్వహించి ఇప్పటివరకు ప్రవేశాలు కల్పించకపోవడం ఏమిటని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ధర్మాసనం సోమవారం తప్పుపట్టింది.

దీనిపై ప్రమాణపత్రం దాఖలుకు ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది. తొమ్మండుగురు బీడీఎస్‌ వైద్యుల అర్జీపై సుప్రీంకోర్టు ధర్మాసనం పది రోజుల క్రితమే కేంద్రానికి, మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ)కి నోటీసులు ఇచ్చింది.

ఎండీఎస్‌ సీట్ల భర్తీని చేపట్టకపోవడం వల్ల దేశానికి కలిగే నష్టాన్ని ఊహించగలరా అని విచారణలో భాగంగా ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.