శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 16 జూన్ 2017 (12:11 IST)

రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో చెప్పకుండా మద్దతివ్వాలా...? మరీ అంత పనికిరాదు... సోనియా గాంధీ

రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో చెప్పకుండానే ఏకాభిప్రాయం కోసం తమవద్దకు రావడంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో చెప్పకుండా తమను మద్దతు కోరడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఉత

రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో చెప్పకుండానే ఏకాభిప్రాయం కోసం తమవద్దకు రావడంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో చెప్పకుండా తమను మద్దతు కోరడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్న నేపధ్యంలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు శుక్రవారం సోనియా గాంధీతో సమావేశమయ్యారు.
 
ఈ సమావేశంలో తాము ఎంపిక చేయబోయే అభ్యర్థిని రాష్ట్రపతిగా చేసేందుకు మద్దతు కావాలని కోరారు. దీనిపై సోనియా స్పందిస్తూ... అసలు రాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేశారు అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఇంకా తాము ఎంపిక చేసే ప్రక్రియలో వున్నట్లు చెప్పారు. ఐతే ఎంపిక చేసిన తర్వాత మద్దతు ఇవ్వాలా వద్దా అనేది ఆలోచన చేస్తామని ఆమె తెలిపినట్లు సమాచారం.