బిపాసా బసు కంటే సన్నీ లియోన్ అయితే బాగా చూపించేది : ప్రమోద్ మథాలిక్
అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున బెంగుళూరులో కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో యోగాసనాలు వేయించేందుకు బాలీవుడ్ నటి బిపాసా బసును ఆహ్వానించడం, ఆమెకు కోటిన్నర రూపాయలు చెల్లించడంపై ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కార్యక్రమంలో గంటన్నర పాటు యోగాసనాలు చేసినందుకు బిపాసా బసుకు కోటిన్నర రూపాయలు చెల్లించారు. పైగా, ఆమెకు రానుపోనూ ప్రయాణ ఖర్చులు, ఒక రోజంతా నక్షత్ర హోటల్‌లో బస చేసేందుకు అయిన ఖర్చులను కర్ణాటక ప్రభుత్వం చెల్లించింది. దీనిపై ప్రజా సంఘాలతో పాటు.. శ్రీరామసేన వ్యవస్థాపకులు ప్రమోద్ ముతాలిక్ మండిపడ్డారు.
ఇదే అంశంపై ఆయన బీదర్‌లో మాట్లాడుతూ శతాబ్దాల కాలంగా భారతీయ సంస్కృతికి అద్దంపట్టే యోగాకు అర్థం లేకుండా బిపాసాబసు వ్యవహరించారని మండిపడ్డారు. ఆమె సంస్కారం కలిగిన మహిళ కాదని ఘాటైన విమర్శచేశారు. మరింత మంది జనం రావాల్సి ఉంటే పోర్న్‌స్టార్ సన్నీ లియోన్‌ను పిలవాల్సిందనీ, ఆమె అయితే మరింత అందంగా, హృదయ అందాలను ఆరబోస్తూ ఆసనాలు వేసి ఉండేదని పేర్కొన్నారు.