శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (18:03 IST)

బీజేపీకి ఓటు వేయని ముస్లింలకు టిక్కెట్ ఎందుకివ్వాలి : కతియార్ సూటిప్రశ్న

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వినయ్ కతియార్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బేజీపీకి ఓటు వేయని ముస్లింలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఎందుకు ఇవ్వాలంటూ సూటిగా ప్రశ్నించారు. ముస్లింలకు టిక్కెట్

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వినయ్ కతియార్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బేజీపీకి ఓటు వేయని ముస్లింలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఎందుకు ఇవ్వాలంటూ సూటిగా ప్రశ్నించారు. ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకపోవడం పొరపాటేనంటూ కేంద్ర మంత్రి ఉమాభారతి ఆదివారం చేసిన వ్యాఖ్యలపై కతియార్ సోమవారం స్పందించారు.
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ.. అసలు ముస్లింలు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారా? మరి అలాంటప్పుడు వారికి టిక్కెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటూ నిలదీశారు. యూపీ ఐదో విడత ఎన్నికల్లో ముస్లింలు ఎవరూ గెలవరని కూడా ఆయన ఢంకా బజాయించారు. 
 
హోం మంత్రి రాజ్‌నాథ్ సైతం 'ముస్లింలకు టిక్కెట్లు ఇచ్చి ఉండొచ్చు' అని అభిప్రాయం వ్యక్తం చేయగా, ఉమాభారతి కూడా ఆయన వాదనను సమర్ధించారు. అయితే గెలుపుగుర్రాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు మాత్రం ముస్లింలు, మహిళలకు టిక్కెట్లు దొరక్కపోవడం పరిపాటేనన్నారు.