శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జులై 2022 (13:16 IST)

నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో వింత శిశువు.. వైద్యులపై ఫైర్

నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్న వింత శిశువు జన్మించింది. దీంతో డాక్టర్లతో గొడవకు దిగారు.. బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాలో తాజాగా చోటుచేసుకుందీ ఘటన.  
 
వివరాల్లోకి వెళితే.. కతిహార్ జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చే హఫ్లగంజ్ గ్రామానికి చెందిన రాజు సాహ్ దంపతులకు వింత శిశువు జన్మించింది. భార్య గర్భందాల్చినప్పటి నుంచి కతిహార్ పట్టణంలోని సదార్ ఆస్పత్రిలో చూయించుకునేవారు. 
 
నెలలు నిండటంతో ఈ మధ్యే ఆమెకు ఆపరేషన్ చేయగా, వింత శిశువు బయటపడింది. పెద్దగా చదువుకోని రాజు గ్రామస్తులంతా ఈ నాలుగు కాళ్లు, నాలుగు చేతుల శిశువును భగవంతుడి అవతారంగా భావించి ఆస్పత్రికి వచ్చి దర్శనాలు కూడా చేసుకున్నారు.
 
రాజు కుటుంబీకులు మాత్రం నవజాత శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయేంటని వైద్య సిబ్బందిని నిలదీశారు. ప్రైవేటు క్లినిక్​ వైద్యులపై బంధువులు ఆరోపణలు చేశారు. 
 
గతంలో స్కానింగ్​ తీసినప్పుడు దీని గురించి ఎలాంటి విషయాలు చెప్పలేదని ఆందోళన చెందారు. ఎప్పుడు అడిగినా శిశువు ఆరోగ్యం ఉన్నట్లు చెప్పేవారని.. చివరకు వింత శిశువు జన్మించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు దాకా వెళ్లినట్లు తెలుస్తోంది.