మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2017 (08:39 IST)

బిడ్డ పురుషాంగాన్ని కోసి మొదటి భర్తకు కానుకగా పంపిన భార్య

చైనాలో ఓ దారుణం జరిగింది. తొలి భర్తకు పుట్టిన బిడ్డ పురుషాంగాన్ని ఏమాత్రం కనికరం లేకుండా కోసేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చైనాకు చెందిన ఓ వివాహిత భార్యాభర్తల మధ్య ఏర్పడిన

చైనాలో ఓ దారుణం జరిగింది. తొలి భర్తకు పుట్టిన బిడ్డ పురుషాంగాన్ని ఏమాత్రం కనికరం లేకుండా కోసేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చైనాకు చెందిన ఓ వివాహిత భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా మరో వ్యక్తిని వివాహం చేసుకుని వేరు కాపురం చేస్తోంది. 
 
అయితే, తొలి భర్తకు పుట్టిన బిడ్డ మాత్రం తన వద్దే ఉన్నాడు. ఈ నేపథ్యంలో తొలి భర్తపై ఉన్న కోపాన్ని బిడ్డపై ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ క్రమంలో మొదటి భర్త వచ్చి గొడవ చేయడంతో అతనిపై ఉన్న కోపాన్ని కన్నబిడ్డపై చూపే క్రమంలో కుమారుడి పురుషాంగాన్ని కోసేసింది. 
 
ఆ తర్వాత దాన్ని పార్శిల్ చేసి మొదటి భర్త కుటుంబసభ్యులకు పంపించిన ఘటన చైనాలో సంచలనం రేపింది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాబును అతని అమ్మమ్మ ఆసుపత్రికి తరలించింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి పురుషాంగాన్ని పునర్ నిర్మించారు. భార్యాభర్తల మధ్య రాజుకున్న కుటుంబ కలహాల వల్ల జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.