శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (14:13 IST)

యూపీలో ఢిల్లీ తరహా ఘటన.. కారు మహిళను 200 మీటర్ల దూరం..

crime scene
ఢిల్లీ తరహా ఘటన యూపీలో చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఓ మహిళను కారు ఈడ్చుకెళ్లిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇదే తరహాలో ప్రస్తుతం యూపీలోనూ జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంభి జిల్లాలో హైస్పీడ్ కారు మహిళ నడుపుతున్న టూవీలర్ ను ఢీకొట్టింది. 
 
అంతేగాకుండా 200 మీటర్లకు పైగా స్కూటర్ ను ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనతో మహిళకు తీవ్రగాయాలై.. కౌశంభిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన డ్రైవర్ ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా కంప్యూటర్ క్లాస్‌లకు హాజరయ్యేందుకు మహిళ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.